navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 12:32 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న డాక్టర్ రఘు దంపతులు

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

తెలంగాణ నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు, డాక్టర్ హేమారెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆర్చనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.