కల్వకోట పాఠశాలలో కోతుల బెడద…
విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు తల్లిదండ్రుల విజ్ఞప్తి నవగీతం,కోరుట్ల ప్రతినిధి: మేడిపల్లి మండలం కల్వకోట గ్రామ జెడ్పీహెచ్ ఎస్,ఎంపీపీఎస్ పాఠశాలలో కోతుల బెడద తీవ్రంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సర్పంచ్ గుగ్గిల రమేష్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. పాఠశాల ఆవరణలోకి తరచూ కోతులు చేరుకొని విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు.పాఠశాల సమయాల్లో తరగతి గదుల సమీపంలో కోతులు సంచరిస్తుండటంతో చిన్నారులు భయంతో బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన...