navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 6:58 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కళాశాలలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పోస్టర్ ఆవిష్కరణ

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

విద్యా శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవ వేడుకలలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజున ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పోస్టర్ తో పాటు బ్రౌచర్ లను స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య నేతృత్వంలో కళాశాల సిబ్బంది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విద్యా వారోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి యోగితా రాణా, కళాశాల విద్యా కమిషనర్ శ్రీమతి అల్లంరాజు దేవసేన లతో పాటు సీ సీ ఈ సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, ప్రొఫెసర్ బాల భాస్కర్ ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యా రంగం అభివృధ్ధి కోసం పాటు పడుతున్న వ్యక్తులతో పాటు ప్రముఖులను గుర్తించి , వారి సేవలను సద్వినియోగం చేసుకోవటమే ఈ వారోత్సవాల ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. కళాశాలలో ఏడు రోజుల పాటు విద్యా వారోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయడమే కళాశాల సిబ్బంది ధ్యేయమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న,కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, ‘దోస్త్’ కో – ఆర్డినేటర్ ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్ లతో పాటు బోధనేతర సిబ్బంది లక్ష్మి నారాయణ,బాబు, శ్రీనివాస్, లింగం,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.