ప్రజల కోసం పోరాటం చేస్తున్న భోగ శ్రావణి
పోలీసు అణచివేతకూ వెనుకాడని మహిళా నేత
జగిత్యాల నియోజకవర్గానికి ఆశా కిరణంలా శ్రావణి
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 18న నిజామాబాద్ ఎంపీ చేపట్టనున్న ధర్మదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీన్ని నిరసిస్తూ బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.మహిళా నేత అని చూడకుండా…మహిళా నేతలు అని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో డాక్టర్ భోగ శ్రావణితో పాటు పలువురు మహిళా నేతలకు గాయాలు అయినప్పటికీ పోలీసులు కనీస కనికరం చూపలేదని పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలు వివాదం ఇదే..ఇక అసలు వివాదానికి కారణమైన కేంద్రీయ విద్యాలయ స్థల వ్యవహారం ప్రస్తుతం జగిత్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం మంజూరు చేయించుకున్నట్లు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వాస్తవానికి కేవలం రెండు ఎకరాల భూమికే ఉత్తర్వులు తీసుకువచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు చెప్పేది ఇదే..కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలంటే సాధారణంగా కనీసం ఐదు ఎకరాల నుంచి గరిష్టంగా పది ఎకరాల వరకు స్థలం అవసరం. అయితే కేవలం రెండు ఎకరాల భూమితో విద్యాలయం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎమ్మెల్యే రాజకీయ ప్రచారం చేస్తున్నారని బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

మహిళ అయినప్పటికీ ధైర్య సాహసాలు తగ్గలేదు..ఈ నేపథ్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ భోగ శ్రావణి చూపిన ధైర్యసాహసాలు నియోజకవర్గ ప్రజల్లో చర్చకు దారితీశాయి. అధికార ఒత్తిళ్లు, పోలీసుల అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై వెనుకడుగు వేయకుండా పోరాడుతున్న మహిళా నేతగా ఆమెకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.జగిత్యాల నియోజకవర్గానికి ఆశా కిరణంలా శ్రావణిజగిత్యాల నియోజకవర్గానికి భవిష్యత్తు ఆశాకిరణంలా డాక్టర్ భోగ శ్రావణి కనిపిస్తున్నారని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదే స్థాయిలో పోరాటం కొనసాగించాలని, ఇందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రజల కోసం పోరాటాన్ని యుద్ధంలా తీసుకుని ముందుకు సాగుతున్న మహిళా నాయకురాలిగా డాక్టర్ భోగ శ్రావణి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారనే చర్చ జగిత్యాలలో జోరుగా సాగుతోంది.
