కొండగట్టు అంజన్న సన్నిధిలో కరీంనగర్ మేయర్ కుటుంబం ప్రత్యేక పూజలు
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రాల్లో విశిష్ట స్థానం కలిగిన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తి భావాలు వెల్లివిరిశాయి. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంజన్న సన్నిధిలో భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ మేయర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో...