నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో అఘోరీ మాత అలియాస్ శ్రీనివాస్ శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య గోత్రనామాలు చదివి ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ప్రత్యేక పూజలు నిర్వహించిన అఘోరీ మాత శ్రీనివాస్ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు చంద్రశేఖర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.