నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ చేతన్ నితిన్ గురువారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను అదనపు ఎస్పీ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్యూ లైన్లు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మాల్యాల సీఐ నీలం రవి తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.