కొండగట్టు నిత్యాన్నదాన సత్రానికి రూ.50 వేల విరాళం

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వి. శ్రీరాములు కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న భక్తులను ఆలయ అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతించారు.ఈ సందర్భంగా ఆలయ ముఖ్య అర్చకులు పవన్ శేషవస్త్రం కప్పి, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించేందుకు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రానికి వి. శ్రీరాములు రూ.50 వేల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అధికారులు విరాళానికి సంబంధించిన...