navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 6:41 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలకు బండి సంజయ్‌కు ఆహ్వానం

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి ఆహ్వానించారు. కరీంనగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం బండి సంజయ్‌ను కలిసిన ఈఓ ఎస్ అంజనారెడ్డి ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా మే 10 నుంచి మే 12, 2026 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ గుండి హరిహరనాథ్, ఉప ప్రధాన అర్చక చిరంజీవి, ముఖ్య అర్చక లక్ష్మణ్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.