navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 4:51 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొడిమ్యాలలో ‘వాక్ ఫర్ అడ్మిషన్’ కార్యక్రమం

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శుక్రవారం “వాక్ ఫర్ అడ్మిషన్” పేరుతో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి. గోపాల్ నేతృత్వంలో అధ్యాపకులు, గ్రామ పెద్దలు కలిసి స్థానిక బస్టాండ్ నుంచి అంగడి బజారు వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రభుత్వ కళాశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి.గోపాల్ మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఆల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను గ్రామ ప్రజలు, విద్యార్థులకు తెలియజేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మండలంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జీవన్ రెడ్డి, అధ్యాపకులు వేణు, నాంపల్లి, జైపాల్ రెడ్డి, ప్రమోద్ కుమార్, బాలకృష్ణారెడ్డి, జయశీల, అనిల్ కుమార్, తిరుపతి, నరసయ్య, సుమన్, భాస్కర్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.