నవగీతం ,ఇల్లంతకుంట ప్రతినిధి:
కొనుగోలు కేంద్రాలలో నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు పక్రియ నత్తనడక సాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం ఒక ప్రకటనలో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాసులు కుప్పలు, తెప్పలుగా ఉన్నాయని, సరియైన టైం లారీలు రాక, కొనుగోలు పక్రియలో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారని అన్నారు. ఒక వైపు రోహిణి కార్తె సమిపించిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తరలించక దిక్కుతోచని స్థితిలో రైతులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని, ఒక వైపు ధాన్యం కొనుగోల్లు వేగంగా జరుగుతున్నాయని గప్పాలు కొట్టె నాయకులు, అధికారులు ఒక్కసారి కొనుగోలు కేంద్రాలకు వచ్చి చూస్తే రైతుల పరిస్థితి అర్థం అవుతుందని ఎద్దేవ చేసారు. అలాగే నెలల తరబడి కొనుగోలు కేంద్రాలలో మొక్క జొన్న, పొద్దుతిరుగుడు పంటలను కూడా కొనుగోలు చేయాలనీ, కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలు, గన్నీ సంచులు వచ్చేలా చూడాలని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే రైతుల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని కొనుగోలు పక్రియ వేగవంతం చేసి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అన్నాడి నరేందర్, మండల అధ్యక్షుడు ఎల్లోజీ తదితరులు పాల్గొన్నారు.