కొనుగోలు పక్రియ వేగవంతం చేయాలి.: టీడీపి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి దామెర సత్యం

నవగీతం ,ఇల్లంతకుంట ప్రతినిధి: కొనుగోలు కేంద్రాలలో నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు పక్రియ నత్తనడక సాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం ఒక ప్రకటనలో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాసులు కుప్పలు, తెప్పలుగా ఉన్నాయని, సరియైన టైం లారీలు రాక, కొనుగోలు పక్రియలో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారని అన్నారు. ఒక వైపు రోహిణి కార్తె సమిపించిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తరలించక దిక్కుతోచని స్థితిలో రైతులు...