navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 7:18 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొలువుదీరిన జగిత్యాల పాక్స్ పాలకవర్గం

రైతు సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాల సేవలు:అధ్యక్షుడు పత్తి రెడ్డి మహిపాల్ రెడ్డి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్ ) పాలకవర్గ సభ్యులు హైకోర్టు ఆదేశాలు మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయంలో పాలక వర్గం కొలువుతీరింది…అనంతరం సంఘ అధ్యక్షులు పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతుల అభివృద్ధికి అవసరమైన సేవలను పారదర్శకంగా అందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ఆరుముల్లా గంగారాం, కొక్కుల శంకరయ్య, తోట గంగరాజాం, అల్లాల రమేష్ రావు, బేతి రాజవ్వ, నిలం లక్ష్మి, ఏలేటి రాజిరెడ్డి, కంకణాల లింగయ్య, బొడ్డుల పోచమల్లయ్య, ముప్పారపు దేవమ్మ పాల్గొన్నారు. అలాగే సంఘ కార్యదర్శి గాజేంగి వేణు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.