నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వసంత అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో పొందుపరచిన అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపినారు. సమావేశంలో పట్టణములోని అన్ని వార్డులలో మురికి కాలువలు శుభ్రం చేయుటకు తగు చర్యలు తీసుకోవల్సిందిగా మరియు నీటి ఎద్దడి గురించి వార్డు సభ్యులందరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరినారు.అనంతరం చైర్ పర్సన్ వసంత మాట్లాడుతూ…ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులలో మురికి కాలువలు శుభ్రపరిచే పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. అలాగే రెవెన్యూ విభాగములో 2025-26 ఆర్ధిక సంవత్సరపు 92% ఇంటి పన్ను వసూలు మరియు ప్రస్తుత సంవత్సరము 2026-27 గాను 5% రిబిట్ లో 41% రెండు కోట్ల 26 లక్షల రూపాయలు పన్ను వసూలు చేసిన బిల్ కలెక్టర్ అందరిని చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్ కౌన్సిల్ సభ్యులందరూ శాలువాలతో సన్మానించారు.ఇట్టి సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ , మున్సిపల్ వైస్ చైర్మన్ , కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు మరియు మున్సిపల్ కమిషనర్ , డీఈఈ, మేనేజర్, జె ఏ ఓ, ఆర్ ఓ మరియు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.