navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 9:34 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కోరుట్ల పోలీస్ అధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి అవగాహన సదస్సు

నవగీతం , కోరుట్ల ప్రతినిధి :

రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని కోరుట్లలోని వాసవి కళ్యాణ మండపంలో సీఐ కె. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిజెపి పార్టీ ముఖ్య నాయకులు మరియు పీస్ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పండుగలను సోదరభావంతో, ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ‘100’ నంబర్‌కు డయల్ చేయాలని లేదా పోలీసులకు తెలపాలని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. అనవసర గొడవలకు దూరంగా ఉండి పోలీసు కేసుల ద్వారా భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై చిరంజీవి, మేడిపల్లి, కథలాపూర్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు మూడు మండలాల ప్రముఖులు పాల్గొన్నారు.