గంగాధరలో బీఆర్ఎస్ రాస్తారోకో

బండి సంజయ్ రాజీనామా చేయాలి సుంకే రవిశంకర్ నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర మండల కేంద్రం మధురానగర్ చౌరస్తాలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నాయకత్వంలో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని...