గ్రామాలకు తరలండి.. ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం

జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : గంగారం మాదిగ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : గ్రామ స్థాయిలో ఉద్యమ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యా చైతన్యాన్ని పెంపొందించే దిశగా “గో టూ విలేజ్” క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాదిగ సంఘ భవన్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ విభాగాల అత్యవసర సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంఎస్పీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగారం...