ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొత్తూరి స్వామి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్తూరి స్వామి మాట్లాడుతూ అసలు పేరు భాగయ్య భాగ్య రెడ్డి వర్మగా మార్చుకున్నారు 1888 మే 22న హైదరాబాదులో ఓ దళిత కుటుంబంలో జన్మించినారు దళిత జాతి ఆత్మగౌరవం అంటరానితనం నిర్మూలనకై బాల్యవివాహాలు జోగిని వ్యవస్థ రద్దుకై అనేక ఉద్యమాలు చేసి ఈ దేశ మూలవాసులం ఆది హిందువులం...