navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 5:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా రత్నాకర్ రావు వర్థంతి వేడుకలు

గ్రామ గ్రామాల్లో నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ మండలం  వేంపల్లి గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రత్నాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి జలపతి రెడ్డి, పోతు శేఖర్, గుగ్లవవత్ శేఖర్, బుక్య జలం, పెండెం గోపాల్, సకినపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

పాతదామరాజుపల్లి లో..

మల్లాపూర్ మండలం పాత దాంరాజుపల్లి గ్రామంలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆరవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.రత్నాకర్ రావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో కొత్తూరి చిన్న రాజరెడ్డి, రోండ్ల రాజరెడ్డి కొత్తూరి గంగారెడ్డి గడ్డం రాజేందర్ రెడ్డి సామ శేఖర్ రెడ్డి, కొమ్ముల చిన్నా రెడ్డి అయ్యోరి దశరథం కొత్తూరి నారాయణరెడ్డి, కొత్తూరి బాజన్న కొత్తూరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

సాతారం గ్రామంలో..

మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి సందర్బంగా రత్నాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్  కిసాన్ గౌడ్  మాజీ  ఎంపిటిసి గున్నల శ్రీనివాస్ ఉప సర్పంచ్ జగన్ రెడ్డి,బొడ్డు రాజేష్, బద్దం మల్లారెడ్డి, గడ్డం శేఖర్ రెడ్డి  కొండూరి నర్సయ్య గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

నడికుడలో..

స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి సందర్భంగా నడికుడ గ్రామంలో నివాళులు అర్పించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గడ్డం మహిపాల్ రెడ్డి ముద్దం రాజేందర్ రెడ్డి ముద్దం రాజేశ్వర్ రెడ్డి బండమీది రాజు నోముల కృష్ణారెడ్డి కొరిపిల్లి శ్రీధర్ రెడ్డి రత్నపురం చిన్నయ్య కస్తూరి పెద్ద గంగారం చిన్న గంగారం మామిడి రాజన్న బషీన్ల మల్లయ్య  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు