navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 1:13 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

నవగీతం, చొప్పదండి:

భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందు ఆద్వర్యంలో వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ  దేశంలో టెలికాం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకు రావడంతో పాటు, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి 18 సంవత్సరాలు దాటిన యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా వారిదేనన్నారు. భవిష్యత్తులో వారి ఆలోచనలను, ఆశయాలను భావి తరాలకు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, మార్కేట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్,కౌన్సిలర్ ఫోరం అధ్యక్షులు గుర్రం సుజీత్ రెడ్డి కౌన్సిలర్స్ గుర్రం రాజేందర్ రెడ్డి,కనుమళ్ళ రాజశేఖర్, వడ్లూరి అనుష శ్యామ్ సుందర్,మార్కేట్ వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్,నాయకులు గుర్రం రమేష్ గౌడ్,కడారి శంకర్, మావూరపు రాములు,ఉప సర్పంచ్ మరం శ్రీనివాస్ (టోని), దూస కైలాసపతి, మహేషుని మల్లేశం,మార్కేట్ డైరెక్టర్ ఈర్ల స్వామి చాంద్ పాషా, జహంగీర్,రజాక్, మారు తిరుపతి రెడ్డి,మహిళా నాయకురాలు చిలుముల స్వప్న, గుంటి స్వరూప, సోమిడి శ్రీనివాస్, కళ్యాణపు శ్రీనివాస్, గుర్రం రాజేందర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు