ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
నవగీతం, చొప్పదండి: భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందు ఆద్వర్యంలో వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో టెలికాం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకు రావడంతో పాటు, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి 18 సంవత్సరాలు దాటిన...