చింతగూడ లక్ష్మీదేవి ఆలయ భక్తుల కోసం ‘ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్’ కల్పించాలి

ఆర్టీసీ అధికారులకు సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కుమార్ వినతి నవగీతం,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీదేవి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చింతగూడ స్టేజ్ వద్ద వెంటనే ‘ఎక్స్‌ప్రెస్ రిక్వెస్ట్ బస్ స్టాప్’ ఏర్పాటు చేయాలని చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ కు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.​ఈ...