నవగీతం, మల్లాపూర్ ప్రతినిది:
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకులు శేఖర్ కుమార్తె ఇటీవల ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందగా శనివారం వారి కుటుంబ సభ్యులను నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు పరామర్శించారు. చిట్టాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి చిన్నారిని పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన వెంట నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ తో పాటు పలువురు ఉన్నారు.
కోరుట్ల లో పరమార్శ:
కోరుట్ల పట్టణానికి చెందిన నాయకులు గొల్లపల్లి నాగరాజు ఇటీవల మాతృవియోగం చెందగా శనివారం వారి కుటుంబ సభ్యులను నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు పరామర్శించారు. కోరుట్ల పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి వారి అమ్మ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన వెంట నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ తో పాటు పలువురు ఉన్నారు.
