చివరి గింజ వరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తాం..
ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగిత్యాల ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అత్యధిక స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, కేంద్రంలో కల్పించిన వసతి సదుపాయాలు, గన్ని సంచుల...