నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి,:
కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గౌతమ్ కృష్ణ, కట్టెకోల హర్షిత్‌లకు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ శనివారం బహుమతులు ప్రదానం చేసినట్లు కోచ్, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21న కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో చెస్, బ్యాడ్మింటన్ మండల స్థాయి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియం బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ విజేతలకు బహుమతులు అందజేశారు.మండల స్థాయి చెస్ పోటీల్లో గౌతమ్ కృష్ణ, బ్యాడ్మింటన్ పోటీల్లో కట్టెకోల హర్షిత్ విజేతలుగా నిలిచారు.ఈ సందర్భంగా డివైఎస్‌వో డాక్టర్ కోరుకంటి రవికుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ వాణి-శ్రీనివాస్ తదితరులు విద్యార్థులను అభినందించారు. కొడిమ్యాల మండలానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి బహుమతులు అందుకోవడం పట్ల మండల విద్యాధికారి ఐత శ్రీనివాస్, ఎంపీడీవో స్వరూప, ఎస్సై ఎస్. సందీప్, హెచ్‌ఎం ఆచి విజయేంద్ర, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.