navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 8:03 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జనగణన లెక్కింపు అవగాహన రన్

పాల్గొన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలో జనగణన–2027 పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం “Run for the Count” కార్యక్రమం నిర్వహించారు. మినీ స్టేడియం నుండి మున్సిపల్ పార్క్ వరకు నిర్వహించిన ఈ అవగాహన రన్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీఓ, జగిత్యాల మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పనకు జనాభా లెక్కల సేకరణ ఎంతో కీలకమని తెలిపారు.ఈసారి ప్రభుత్వం ప్రజలకు స్వీయ గణన (Self Enumeration) చేసే అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభమయ్యే జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ “Run for the Count” కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరూ జనాభా లెక్కల్లో సరైన వివరాలు అందించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే జనగణన–2027 విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.