navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 12:51 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు..

బీర్‌పూర్ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

జగిత్యాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈనెల 26న ఉదయం 8:30 గంటల నుంచి తెల్లవారు ఉదయం 5 గంటల వరకు జిల్లాలో వివిధ మండలాల్లో వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా బీర్‌పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో 31.3 మిల్లీమీటర్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. మెట్ పల్లి మండలంలోని జగ్గాసాగర్‌లో 13.0 మి.మీ, మల్లాపూర్ మండల కేంద్రంలో 11.5 మి.మీ, భీమారం మండలంలోని మన్నెగూడెంలో 11.0 మి.మీ వర్షపాతం నమోదైంది.ఇక మెట్ పల్లిలో 10.3 మి.మీ, ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరులో 8.0 మి.మీ, కథలాపూర్‌లో 8.0 మి.మీ, కోరుట్లలో 7.5 మి.మీ, బుగ్గారం మండలంలోని సిరికొండలో 6.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 6.5 మి.మీ, మేడిపల్లిలో 6.3 మి.మీ, జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస (ఏఆర్‌ఎస్)లో 5.5 మి.మీ, జగిత్యాలలో 4.8 మి.మీ, ఎండపల్లిలోని గుల్లకోటలో 3.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే కోరుట్ల మండలంలోని ఐలాపూర్‌లో 3.5 మి.మీ, గొల్లపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో 3.3 మి.మీ, రాయికల్‌లో 2.3 మి.మీ, కోడిమ్యాలలోని పుదూరులో 1.3 మి.మీ, వెల్గటూరులో 1.3 మి.మీ, రాయికల్ మండలంలోని అల్లీపూర్‌లో 0.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.కాగా వర్షాల కారణంగా ఉదయం వేళల్లో వాతావరణం చల్లబడగా, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.