navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 5:49 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

డాక్టరేట్ పొందిన చెగ్గం సుస్మిత గంగపుత్ర

అభినదించిన టి.జి.ఎస్ రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర

నవగీతం, వరంగల్ ప్రతినిధి :

రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అధ్యాపకులురాలిగా పనిచేస్తున్న చెగ్గం సుస్మిత గంగపుత్ర కాకతియ విశ్వ విద్యాలయం అర్ధ శాస్త్ర విభాగంలో మత్యకారుల జివన పరిస్థితుల పై ఒక అధ్యయనం అనే అంశం పై డాక్టర్ స్వరూప రాణి పర్యవేక్షణలో చేసిన పరిశోధనకుగాను కాకతియ విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర చెగ్గం సుస్మిత గంగపుత్రకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచూ చెగ్గం సుస్మిత గంగపుత్ర సాంప్రదాయ మత్యకార గంగపుత్ర కులంలో జన్మించి అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ మత్యకార స్థితి గతుల అధ్యయనం పై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందడం అభినందనీయమంటూ రానున్న రోజులలో ప్రతిభ కలిగిన నిరుపేద గంగపుత్ర విద్యార్థుల విద్యవికాసానికి కృషి చేయాలన్నారు