navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 9:08 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

డాక్టరేట్ పొందిన మీసాల శ్రీజ

అగ్రికల్చర్ ఆగ్రానమిలో పిహెచ్ డి పూర్తి

నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన మీసాల శ్రీజ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్ డి పట్టా పొందింది.2021 – 2026 విద్యా సంవత్సరానికి గాను పి హెచ్ డి ( అగ్రికల్చర్ అగ్రనామి ) శ్రీజ పట్టా పుచ్చుకుంది. గైడ్ గా డాక్టర్ బి. పద్మజ ప్రిన్సిపాల్ సైన్టిస్ట్ నేత్రుత్వంలో పి హెచ్ డి ని శ్రీజ పూర్తి చేసింది.వైవా పరిశీలకులుగా వ్యవవహరించిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సైన్టిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. మురళి చేతుల మీదుగా పట్టా అందుకుంది.తల్లి మీసాల హంసలీల అంగన్వాడీ టీచర్ గా , తండ్రి మీసాల రాజమౌళి పత్రిక విలేఖరిగా విధులు నిర్వర్తిస్తారు.నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో జిల్లెల్ల లోని బాబు జసగజీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ గా విధులు నిర్వర్తిస్తోంది.ప్రాథమిక విద్యను ఇల్లంతకుంట మండలం తాళ్ళల్ల పల్లె ప్రభుత్వ పాఠశాలలో కొనసాగించిన శ్రీజ 5వ తరగతి నుండి 10 వ తరగతి వరకు తంగళ్లపెల్లి మండలం బాలికల గురుకుల పాఠశాల బద్దెన పెల్లిలో చదివి పదవతరగతిలో 10/10 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రధమ ర్యాంకు సాధించింది.ఇంటర్ శ్రీచైతన్య కళాశాల హైదరాబాద్, బి ఎస్సి ( అగ్రి కల్చర్ ) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ హైదరాబాద్ లో , ఎమ్మెస్సి ( అగ్రికల్చర్ ఇన్ అగ్రనామి ) ఒడిస్సా వ్యవసాయ విశ్వ విద్యాలయం, పి హెచ్ డి ( అగ్రికల్చర్ ఇన్ అగ్రనామీ ) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం లో పూర్తి చేసి తన ప్రతిభను చాటుకుంది. సాధారణ కుటుంభం నుండి వచ్చిన శ్రీజ అసాధారణ అగ్రికల్చర్ డాక్టరేట్ పట్టాను అందుకున్న శ్రీజను బంధువులు, మిత్రులు, మండల ప్రజలు అభినందిస్తున్నారు.