తహసిల్దార్ ను సన్మానించిన రేషన్ డీలర్లు

నవగీతం మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రంలో మండల   తహసిల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాహసిల్దార్  రామ్ చందర్ ని మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి వారిని శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దప్పుల నర్సయ్య ,గౌరవ అధ్యక్షులు ముద్ధం ప్రకాష్ , గంగాధర్, వెంకట్, లలిత ప్రవళిక  తదితరులు పాల్గొన్నారు.