తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:(వి.సంపత్) తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మేడిపల్లి, భీమారం మండలాల్లో నిర్వహించిన పలు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.మొదటగా ఇటీవల మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని శివగంగ కోనేరు వద్ద ప్రమాదవశాత్తు మృతి చెందిన శివ, శర్విందు, మహాన్విత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతో విషాదకరమని పేర్కొంటూ, మృతుల ఆత్మలకు శాంతి...