navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 2:55 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

తెలుగుదేశం పార్టీ అభిమాని రక్తదానం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మోత్కురి రాజేంధర్ గౌడ్ జగిత్యాల జిల్లా కేంద్రం లో నేలవెల్లి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేయటం జరిగింది.తెలుగువారి ఆత్మగౌరవనికి ప్రతీకగా నిలిచింది ఎన్టీఆర్ అని రూ.2 కిలొ బియ్యం ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పేదలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న భూస్వామ్య వ్యవస్థను (పటేల్, పట్వారీ) రద్దు చేసి, పాలనను ప్రజల చెంతకు చేర్చారు.ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు ఎన్టీఆర్ తీసుకున్నారు.అప్పటి నిర్ణయాల ఫలాలనే ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్నాం అని తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ఘనత అని మోత్కురి రాజేంధర్ గౌడ్ కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకోని ప్రతి మూడు నెలలకోసారి టీడీపీ అధికారం లో ఉన్నన్ని రోజులు రక్తదానం చేస్తున్నానని తెలిపారు.