తోటి రిపోర్టర్ జ్ఞాపకార్థం ఐజేయూ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: తోటి రిపోర్టర్ మిత్రుడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ జ్ఞాపకార్థం సోమవారం రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు టీయూడబ్ల్యూజే (ఐజేయు) మెట్ పల్లి ప్రింట్ మీడియా సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజేయు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ మంచివాడు మనలో ఒకడు సాటి జర్నలిస్టును కోల్పోవడం చాలా బాధాకరం అని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని వేడుకుంటున్నామని అన్నారు. మన...