త్వరితగతిన మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలి
15 రోజుల్లో 100శాతం ధాన్యం కొనుగోలు పూర్తికి ప్రణాళిక జగిత్యాల జిల్లా ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: రవి సీజన్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు జగిత్యాల జిల్లా ఇప్పటి వరకు ఆరవ స్థానంలో నిలిచిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు పై అధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ...