కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి:
దళారులకు ధాన్యాన్ని అమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గోధుర్ గ్రామంలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బండి రాజేష్, జువ్వాడి కృష్ణారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతు రైతుల సౌకర్యార్థం కోసం ఎంతో కష్టపడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు శుద్ధి చేసిన ధాన్యాన్ని మాత్రమే అందించి మద్దతు ధర పొందాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, కామన్ గ్రేట్ ధాన్యానికి 2369 మద్దతు ధర ఉంటుందన్నారు. ప్రభుత్వం సన్నబడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా అందిస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని రైతులు వినియోగించుకోవాలని కోరారు. రైతులు తమ వెంట పాసుబుక్కులు బ్యాంక్ ఆత పుస్తకాలు ఆధార్ కార్డు తీసుకుని వచ్చి పేర్లు నమోదు చేసుకుని వెళ్ళవలసిందిగా ఏపిఎం శంకర్ కోరారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరప్రసాద్, శ్రీకాంత్, ఐకెపి ఎపిఎం శంకర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూస రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు