దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు
పద్మశ్రీ డాక్టర్ మంద కృష్ణ మాదిగ నవగీతం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గార్డెన్ లో మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాస్టర్స్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల హక్కుల అవగాహనా సదస్సు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు అందరూ కూడ తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పాడిందని, హక్కుల పోరాట సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రభుత్వం...