ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ ప్రకటనలో తెలిపారు.ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తేమ పేరిట కోతలు, గన్నీ సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం...