ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి.

కొనుగోలు కేంద్రాన్ని  ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ సత్య ప్రసాద్ నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: జగిత్యాల  జిల్లాలోని  మెట్ పల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మ నగర్, వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.ధాన్యం...