వరి ధాన్యం కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

మిల్లుల వద్ద లారీలను 24 గంటల్లో అన్లోడ్ చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం మిల్లులకు తరలింపులో ఎలాంటి అలసత్వం వహించరాదని, మిల్లుల వద్దకు చేరుకున్న లారీలను 24 గంటల్లోగా అన్లోడ్ చేసి వెంటనే పంపించాలని స్పష్టం చేశారు....