ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి – అదనపు కలెక్టర్ బి.ఎస్ లత
నవగీతం,జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతంగా పూర్తి చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అధికారులను ఆదేశించారు.బుధవారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు చల్‌గల్ గ్రామంలోని ఏఎంసీ సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.కేంద్రాల్లో హమాలీలు...