ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
24 గంటల్లోనే లారీల అన్లోడింగ్ పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అధికారులను ఆదేశించారు. శనివారం కొడిమ్యాల మండలం నాచుపెల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు శ్రీ రామాంజనేయ రైస్ మిల్లులను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రత్యక్షంగా...