ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రైతులకు ఇబ్బంది కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ నవగీతం,కోరుట్ల ప్రతినిధి:(వి. సంపత్) జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని కలికోట, అంబారి పేట, తాండ్రియాల, గంబీర్ పూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు...