ధాన్యం తరలింపు, మిల్లింగ్ పనులు వేగవంతం చేయాలి
–జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో ఉన్న కొత్త సురేష్, జి.కె.ఎస్, అమీర్ రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మిల్లులలో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, లోడింగ్ మరియు అన్‌లోడింగ్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించి సంబంధిత...