నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నవగీతం,జగిత్యాల ప్రతినిధి;
నరేంద్ర మోదీ సభను సక్సెస్ చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ సందర్భంగా ఆదివారం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి తదితరులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
