navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 8:59 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బి.ఎస్ లత

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల పట్టణంలోని SKNR డిగ్రీ & పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన NEET-UG పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బి.ఎస్ లత పరిశీలించారు. నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలోని గదుల అమరిక, సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, భద్రతా చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని అధికారులకు సూచించారు. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ఎటువంటి లోపాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.అభ్యర్థులు సమయానికి కేంద్రానికి చేరుకునేలా మరియు వారికి కావలిసిన సదుపాయాలు కల్పించాలని తెలిపారు.పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము,డియంహెచ్ఓ సుజాత, ఎస్ కె ఎన్ ఆర్ కాలేజి ప్రిన్సిపాల్ అరిగెల అశోక్, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రామ్ మెహన్, సంబంధిత అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, కళాశాల సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.