navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 2:22 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నూతన పైప్ లైన్ నిర్మాణానికి భూమి పూజ

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో నూతన పైప్ లైన్ నిర్మాణానికి సర్పంచ్ పుప్పాల లక్ష్మి భూమి పూజ చేశారు. డబ్బా నుండి వర్షకొండ కు వెళ్లే దారిలో ఉన్న నల్లనూతి నుండి కెనాల్ వరకు శిధిల వ్యవస్థకు చేరిన పైపులైను తొలగించి నూతన పైపులైను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కాగా నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాపల్లి మహేష్, మాజీ సర్పంచులు పుప్పాల నర్సయ్య, కంఠం రమేష్, హైకోర్టు న్యాయవాది శివ, డబ్బా మాజీ విడిసి చైర్మన్ జాన శంకర్, పుప్పాల మహేష్,, తదితరులు పాల్గొన్నారు