నూతన మండల అధ్యక్షుడికి ఘన సన్మానం

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: ఇటీవల మల్లాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన మాట్ల సోమయ్య ని కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోతు శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వీరితో వేంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదళ్ జిల్లా జాయింట్ సెక్రెటరీ బాజోజి సత్యనారాయణ, ఇందిరమ్మ కమిటీ నెంబర్ కనక లక్ష్మణ్, మండల నాయకులు, కోటగిరి ఆనంద్,మరిపెల్లియ్య, సిరిపురం రవీందర్, సాతర్ల రాజేందర్ తదితరులు ఉన్నారు.