పట్టణాన్ని మరిన్ని హంగులతో అభివృద్ధి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి

నూతనంగా పునరుద్ధరించిన వాటర్ ఫౌంటెన్‌ ప్రారంభం నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణ సుందరీకరణలో భాగంగా స్థానిక పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద నూతనంగా పునరుద్ధరించిన వాటర్ ఫౌంటెన్‌ను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ,వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ కౌన్సిలర్లతో కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఎంతో కాలంగా నిలిచిపోయిన శాస్త్రి చౌరస్తా ఫౌంటెన్‌ను ఆధునీకరించి, ప్రజలకు అందుబాటులోకి...