navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 8:17 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పలువురికి కృత్రిమ కాలు అందజేత

నవగీతం,వైరా ప్రతినిధి:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలకు చెందినటువంటి నలుగురి దివ్యాంగులకు నారాయణ సేవా సంస్థాన్ హైదరాబాద్ వారి సహకారంతో కృత్రిమ కాళ్ళు అందజేశారు వైరా మండలం సోమవారం గ్రామానికి చెందిన కొప్పులు రామకృష్ణారావుకు రోడ్డు ప్రమాదములో వలన గత పదేండ్ల క్రితం కుడికాలు తొలగించారు అదేవిధంగా కృష్ణాజిల్లా తిరువూరు కి చెందిన మీసాల వెంకట సత్యనారాయణ కు మధుమేహంతో ఎడమ కాలు తొలగించారు. వైరా మండలం గొల్లపూడికి చెందిన బంక మల్లయ్య అనే వ్యక్తి కీ మధుమేహం తో ఏడాది క్రీతం కాలు తొలగించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన తుర్రం శ్రీరాములు రోడ్డు ప్రమాదం లో గత ఏడాది కుడికాలు కోల్పోయిన వీరందరి వివరాలు తెలుసుకున్న వైరా పట్టణ ఎస్ఐ పుష్పాల రామారావు వీరి కుటుంబీకులను సంప్రదించి వీరు సాధారణ జీవితం గడిపేందుకు తమ దయ నందిన జీవన కార్యకలాపాలు కొనసాగించేందుకు అధునాతనమైన కృత్రిమ కాళ్ళు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఇట్టి విషయాన్ని హైదరాబాద్ కు చెందిన నారాయణ సేవా సంస్థ సభ్యులను సంప్రదించి వారి సహకారంతో వారు ఏర్పాటు చేసిన క్యాంపులో ఈ నలుగురికి జర్మన్ నుంచి దిగుమతి చేసుకున్న అధునాతనమైన కృత్రిమకాళ్లను ను నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో వీరికి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నలుగురు దివ్యాంగులు తమకు కృత్రిమకాలు అమర్చేందుకు కృషిచేసిన వైరా పట్టణ ఎస్ఐ పుష్పాల రామా రావును తమ కుటుంబం తో దివ్యాంగులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.