పలు అభివృద్ధి పనుల కోసం యంపి కి వినతిపత్రం అందజేసిన రేగుంట సర్పంచ్

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కి రేగుంట సర్పంచ్ తిట్ల లహరి రాజేష్ వినతిపత్రాన్ని అందజేశారు.రేగుంట గ్రామంలో పల్లె దవాఖాన భవనం శిథిలావస్థకు చేరడంతో అట్టి భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించవలసిందిగా అలాగే అంగన్‌వాడీ భవనాల గురించి మరియు గ్రామంలో ఉన్న తదితర సమస్యలను కూడా యంపి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాన్ని అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, మల్లాపూర్ పట్టణ...